Plane Engine Catches Fire | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. వీడియో
Plane Engine Catches Fire | ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఇంజిన్ (Engine)ఫెయిల్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Plane Engine Catches Fire | ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఇంజిన్ (Engine)ఫెయిల్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగినప్పటికీ సిబ్బంది ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ (Southwest Airlines)కు చెందిన బోయింగ్ 737 విమానం టెక్సాస్ (Texas) లోని హాబీ విమానాశ్రయం ( Hobby Airport) నుంచి మెక్సికో (Mexico)లోని కాన్కన్ (Cancun) అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలు దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌నుంచి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని టేకాఫ్ అయిన 30 నిమిషాల వ్యవధిలోనే హాబీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం నుంచి మంటలు వస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
https://twitter.com/rontech777/status/1692298312899281117?s=20
Also Read..
Rajasthan | విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని.. హాస్టళ్లలో ఫ్యాన్లన్నీ మార్చేసిన అధికారులు
ASP | ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ.. షాకిచ్చిన ఉన్నతాధికారులు
Manipur Violence | మణిపూర్‌లో మరోసారి రెచ్చిపోయిన అల్లరి మూకలు.. ముగ్గురు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

