Rajasthan | ఆ హాస్టల్స్‌లో ఫ్యాన్లు మారాయ్..! విద్యార్థుల ఆత్మహత్యల ఎఫెక్ట్
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను ఏర్పాటు చేస్తున్నారు.
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒత్తిడి కారణంగా ఈ నెలలోనే ఏకంగా నలుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకోగా.. ఏడాదిలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను ఏర్పాటు చేస్తున్నారు.
కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెలలో ఏకంగా నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక గతేడాది కోచింగ్ హబ్‌లో కనీసం 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అన్ని హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు.
#WATCH | Spring-loaded fans installed in all hostels and paying guest (PG) accommodations of Kota to decrease suicide cases among students, (17.08) https://t.co/laxcU1LHeW pic.twitter.com/J16ccd4X0S
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023
Also Read..
CTET Admit Card 2023 | సీటెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే
ASP | ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ.. షాకిచ్చిన ఉన్నతాధికారులు
Manipur Violence | మణిపూర్‌లో మరోసారి రెచ్చిపోయిన అల్లరి మూకలు.. ముగ్గురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

