CTET Admit Card 2023 | టీచింగ్ (Teaching Proffesion) ను కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్న వారి కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రతి ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష(CTET)ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది నిర్వహించనున్న సీటెట్ పరీక్ష ఆగస్టు 20న జరుగనుంది. కాగా దీనికి సంబంధించిన సీటెట్ హాల్ టికెట్స్ (Admit Card)ను సీబీఎస్ఈ (CBSE) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://ctet.nic.in/ వెబ్సైట్లో చూడండి.
ఈ ఏడాది సీటెట్ (CTET) కు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీఎస్ఈ (CBSE) ఏప్రిల్ 27న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 20న ఈ పరీక్ష జరగనుండగా.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు.
ఇక సీ-టెట్ ఎగ్జామ్‌ను ఒకసారి క్లియర్ చేస్తే, అభ్యర్థులు తమ జీవితంలో ఏ సమయంలోనైనా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ ఇప్పుడు నెట్ (NTA NET) పరీక్ష లాగానే లైఫ్‌లాంగ్ చెల్లుబాటుకానుంది.