బెంగళూరు: హైవేపై వేగంగా దూసుకెళ్లిన కారు బుల్లెట్ బైక్‌ను ఢీకొట్టింది. (Car Drags Bike) కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అయినప్పటికీ డ్రైవర్ ఆ కారును ఆపకుండా పారిపోయాడు. బైక్‌పై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఇద్దరు వ్యక్తులు బుల్లెట్ బైక్‌పై దేవనహళ్లి నుంచి దొడ్డబళ్లాపూర్ వెళ్తున్నారు. జాతీయ రహదారి 648పై వేగంగా దూసుకొచ్చిన కారు ఆ బైక్‌ను ఢీకొట్టింది.
కాగా, బుల్లెట్ బైక్ ఆ కారు ముందు చిక్కుకున్నది. అయినప్పటికీ డ్రైవర్ కారును నిలుపలేదు. బుల్లెట్ బైక్‌తోపాటు దానిపై ఉన్న ఇద్దరిని వంద మీటర్ల వరకు ఆ కారు ఈడ్చుకెళ్లింది. ఎదురుగా బైక్‌పై వచ్చిన మరో వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ బైక్‌పై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు ధరించినప్పటికీ ఈ ప్రమాదంలో మరణించారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన ఇద్దరు యువకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారును గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
Ink Attack On Maratha Leader | మరాఠా సంస్థ నేతపై సిరా దాడి.. బీజేపీ నేత ప్రమేయంపై ఆరోపణలు
Watch: మహిళ జుట్టు పట్టుకున్న మగ గొరిల్లా.. ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?