భోపాల్: టోల్ ప్లాజా సిబ్బందిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Car Attempts To Run Over Toll Plaza Employee) శనివారం గ్వాలియర్‌లోని టోల్ ప్లాజా వద్ద ఒక తెల్లని కారు ఆగి ఉన్నది. ఉన్నట్టుండి అది వేగంగా అక్కడి నుంచి కదిలింది. ఆపేందుకు ప్రయత్నించిన టోల్ ప్లాజా ఉద్యోగిని ఢీకొట్టేందుకు కారు డ్రైవర్ యత్నించాడు. అదుపుతప్పిన ఆ వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. అనంతరం ఆ కారు వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, టోల్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ద్వారా డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Gwalior MP🚨,An attempt was made to crush a toll employee with a vehicle at Gwalior toll plaza, The accused fled from the spot! pic.twitter.com/aF3oEWdBub
— Deadly Kalesh (@Deadlykalesh) August 23, 2025
Also Read:
Man Reports Wife Missing | భార్య మిస్సింగ్‌పై భర్త ఫిర్యాదు.. హత్య చేసినట్లు పట్టించిన కలరా ఉండలు