CM Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) ని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఈ అంశంపై సిద్ధరామయ్య తాజాగా మరోసారి స్పందించారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో సిద్ధరామయ్య ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నాయకుల పూర్తి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. ‘నాయకత్వ మార్పు అంశం హైకమాండ్ వద్ద లేదు. భేటీలో దాని గురించి చర్చ జరగలేదు. గాంధీలు సహా కాంగ్రెస్ అగ్ర నాయకుల పూర్తి మద్దతు నాకు ఉంది. వారి మద్దతు లేకుంటే నేను సీఎం పదవిలో కొనసాగి ఉండేవాడిని కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi: “How many times do I tell you, it (speculations around Karnataka CM post) was not discussed at all? This issue was not discussed at all with the high command,” says Karnataka CM Siddaramaiah when asked about his meeting with Congress high command pic.twitter.com/nHZc9TH5jC
— ANI (@ANI) July 11, 2025
ఇవ్వడానికి కుర్చీ ఖాళీ లేదు..
నాయకత్వం మార్పు అంశంపై సిద్ధరామయ్య గురువారం స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar)ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. రాష్ట్రంలో ఐదేండ్ల పాటు పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, డీకేను సీఎంను చేయడానికి పదవి నుంచి దిగిపొమ్మని అధిష్ఠానం తనను అడిగినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘ఐదేండ్ల పాటు నేనే సీఎంగా ఉంటా. ఈ విషయం నేను ఎప్పుడో స్పష్టం చేశా. జూలై 2న చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయం చెప్పా. ఆ రోజు నా పక్కన శివకుమార్ కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. సీఎం పదవిపై డీకే ఆశపడుతున్న విషయంపై ఆయన మాట్లాడుతూ ‘డీకే కూడా ఈ పదవికి ఆశావహుడే. అందులో ఎలాంటి తప్పూ లేదు. ఆయన కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు’ అని చెప్పారు.
Also Read..
“ఐదేండ్లూ నేనే సీఎం ఇవ్వడానికి కుర్చీ ఖాళీ లేదు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య”
“Karnataka | అవును.. చాలామంది ఎమ్మెల్యేలు డీకే సీఎం కావాలనుకుంటున్నారు : ఎమ్మెల్యే యోగేశ్వర్”
“నాకు వేరే గత్యంతరం లేదు.. అధిష్టానం చెప్పినట్టు సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వాల్సిందే: డీకే శివకుమార్”