Uttar Pradesh | బరేలీ: తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలసి నృత్యం చేస్తూ ఓ 45 ఏళ్ల చెప్పుల వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. షాహాబాద్ ప్రాంతంలోని ఓ వివాహ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. రెండు నిమిషాల పాటు వాసిం తన భార్యతో కలసి నృత్యం చేయడం ఓ వీడియోలో కనిపించింది. నృత్యం ఆపి పక్కకు వచ్చిన అతను హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
కాఠ్మాండూ, ఏప్రిల్ 4: పెను భూకంప విలయం నుంచి మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు తేరుకోకముందే తాజాగా శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత్‌లోని ఉత్తర ప్రాంతంపై కూడా పడింది. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌లో కూడా ప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం నేపాల్‌లో రాత్రి 7.52 గంటలకు భూకంపం సంభవించగా, 20 కి.మీ లోతున దీని కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది.