Building collapses | కర్ణాటక ( Karnataka) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలో ఓ నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses). అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
కోలార్ (Kolar)లోని బంగార్పేట్ (Bangarpet)లో రెండంతస్తుల నివాస భవనంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో పనులు చేస్తుండగా.. భవనానికి పగుళ్లు వచ్చాయి. ఈ క్రమంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, ప్రమాదాన్ని ముందే ఊహించిన అగ్నిమాపక శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అందులో నివసిస్తున్న మూడు కుటుంబాలను ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు బిల్డింగ్ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
கர்நாடகா பங்கார்பேட் பகுதியில் புதுப்பிக்கும் பணியின்போது இடிந்து விழுந்த இரண்டு மாடிக் கட்டிடம் #Bangarpet #Karnataka pic.twitter.com/mTOZACsxBA
— Priya Gurunathan (@JournoPG) November 8, 2024
Also Read..
Virat Kohli | ముంబై రెస్టారెంట్లో కోహ్లీ – అనుష్క సందడి.. ఫొటోలు వైరల్