న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana bhavan) ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు (National commission for women) ఫిర్యాదు చేయనున్నారు.
Delhi | BRS workers and supporters protest against Telangana BJP president Bandi Sanjay for his reported derogatory comments against BRS MLC K Kavitha. The protesters also burnt his effigy.
K Kavitha is appearing before ED today in Delhi, in the liquor policy case. pic.twitter.com/dYEmgim1Pc
— ANI (@ANI) March 11, 2023
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలును ఉపసంహరించుకోవాలని మహబూబాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బండి సంజయ్‌కి అక్కా చెల్లెలు లేరా అని నిలదీశారు. ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలన్నారు. మరోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలన్నారు.