School Children | హర్యానా (Haryana) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోమ్‌వర్క్ చేయలేదన్న కారణంతో ఓ చిన్నారిని (school children) కిటికీకి తలకిందలుగా వేలాడదీసి చితకబాదారు. ఈ అమానవీయ ఘటన పానిపట్ (Panipat)లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది.
ముఖిజా కాలనీకి చెందిన ఓ కుటుంబం తన ఏడేళ్ల బాలుడిని స్థానిక ప్రైవేట్ పాఠశాల (school)లో చేర్పించింది. రెండో తరగతి చదువుతున్న ఆ చిన్నారి (Class 2 student) హోమ్‌వర్క్ పూర్తి చేయకపోవడంతో (not completing homework) ప్రిన్సిపాల్ రీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్ అనే వ్యక్తికి చిన్నారిని శిక్షించమని ఆదేశించింది. ప్రిన్సిపాల్ ఆదేశాలతో సదరు డ్రైవర్ బాలుడిని తాళ్లతో పాఠశాల కిటికీకి తలకిందలుగా వేలాడదీశాడు.
అనంతరం చిన్నారిని దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగని అజయ్.. చిన్నారిని కొడుతున్న దృష్యాలను తమ ఫ్రెండ్స్‌కు వీడియో కాల్ చేసి మరీ పైశాచిన ఆనందాన్ని పొందాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, పాఠశాల ప్రిన్సిపాల్ రీనా స్వయంగా చిన్న పిల్లల్ని కొడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
ఈ వీడియోలు బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. పలుసార్లు పిల్లలను శిక్షగా టాయిలెట్లను కూడా శుభ్రం చేయిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ అమానవీయ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మోడల్ టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. పలు సెక్షన్ల కింద ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
Also Read..
Asia Cup trophy | ట్రోఫీని ఆయన ఎలా తీసుకెళ్తారు..? పీసీబీ చీఫ్ తీరుపై బీసీసీఐ ఆగ్రహం
Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. టీవీకే చీఫ్ విజయ్‌కి బాంబు బెదిరింపులు