మహా-కర్ణాటక మాటల యుద్ధం
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదిరిపాకాన పడింది. మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది.
- ఇరు రాష్ర్టాల మధ్య ముదిరిన సరిహద్దు వివాదం
- ముంబైని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న కర్ణాటక మంత్రి
- ‘ఎవడబ్బ సొమ్ము కాదు’ అన్న డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
- బీదర్, బెళగావి తమకివ్వాలని మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం
- అంగుళం కూడా వదులుకు నేది లేదన్న కర్ణాటక సీఎం
ముంబై/బెంగళూరు, డిసెంబర్ 28: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదిరిపాకాన పడింది. మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది. రెండు రాష్ర్టాల బీజేపీ సర్కార్లు కత్తులు దూస్తున్నాయి. బెళగావి మహారాష్ట్రకు దక్కాలని మహారాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫైర్ అయ్యారు. ఒక్క అంగుళం కూడా వదులుకునేది లేదని స్పష్టంచేశారు. మరోవైపు కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి ఈ వివాదంలోకి ముంబైని లాగారు. మరాఠీలు ఎక్కుగా ఉన్నారు కనుక బెళగావిని కనీసం కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్పై కర్ణాటక మంత్రి అశ్వత్థనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సబబైతే ముంబైని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని వివాదాన్ని కొత్తమలుపు తిప్పారు.
ముంబైలో 20 శాతం మంది కన్నడిగులు ఉన్నారని, కనుక ఆ మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మహారాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. ముంబై ‘ఎవడబ్బ సొమ్ము కాదు’ అని మండిపడ్డారు. అది పూర్తిగా మహారాష్ట్రకు చెందినదని స్పష్టంచేశారు.
రాష్ట్రం అభిప్రాయాలను కర్ణాటక ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేస్తామని పేర్కొన్నారు. దీనిపై విపక్ష నేత అజిత్ పవార్ (ఎన్సీపీ) స్పందిస్తూ.. కర్ణాటక సీఎం, మంత్రులు మహారాష్ట్ర ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఆ స్థాయిలో లేదని విమర్శించారు. అలాంటి ‘వాగుడుకాయ’లను మందలించాలని కేంద్ర హోంమంత్రిని కోరుతామని తమపార్టీ కర్ణాటక మంత్రులను ఉద్దేశించి ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. బెళగావి, కార్వార్, బీదర్తో సహా కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రజలున్న 865 గ్రామాలను మహారాష్ట్రలో కలుపాలని ఆ రాష్ట్ర ఉభయసభలు తీర్మానం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

