చెన్నై: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల బొనాంజా కింద నగదు జమ చేసి విపక్షాలకు షాక్ ఇచ్చింది. నెలకు రూ.1,000 సహాయ పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో శుక్రవారం 5,000 రూపాయల నగదును జమ చేసింది.
తాము తిరిగి అధికారంలోకి వస్తే ఈ నెలవారీ సహాయాన్ని రూ.2,000కు పెంచుతామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ లబ్ధిదారులకు కొన్ని నెలల పాటు ఈ సహాయం అందకుండా చేసేందుకు విపక్ష బీజేపీ, ఏఐఏడీఎంకేలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.