Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మాజీ మంత్రికి బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2022 ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేసింది.
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2022 ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఎన్సీపీ నేతను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితోపాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ బాంబే హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారు. అయితే జస్టిస్ అనూజా ప్రభుదేశాయ్ బెంచ్ బెయిల్‌ను తోసిపుచ్చింది. బెయిల్‌పై దాఖలైన పిటిషన్‌ను రెండు వారాల తర్వాత విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని, ప్రస్తుతం కిడ్నీ వ్యాధి రెండు, మూడో దశలో ఉన్నాడని.. ఈ పరిస్థితుల్లోనే ఉంచితే ప్రాణాంతకంగా మారుతుందని ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

