IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. లక్నోలో అత్యవసర ల్యాండింగ్
IndiGo flight : ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా (పశ్చిమ బెంగాల్) ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
IndiGo flight : ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా (పశ్చిమ బెంగాల్) ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. అయితే, ఈ బాంబు బెదిరింపు గతంలోలాగా ఫోన్, మెయిల్, మెసేజ్ ద్వారా కాకుండా.. విమానంలో ఒక నోట్ ద్వారా వచ్చింది.
విమానంలో ఒక టిష్యూ పేపర్ పై గుర్తు తెలియని వ్యక్తి చేతితో ఈ బెదిరింపు పత్రం రాసినట్లు ఏసీపీ రజనీష్ వర్మ తెలిపారు. ఇండిగో విమానం ఉదయం ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా వెళ్తుండగా.. విమానంలో బాంబు ఉందని ఆ విమానంలోని టాయిలెట్ లో ఉన్న ఒక టిష్యూ పేపర్ పై చేతి రాతతో రాసి ఉండగా సిబ్బంది గుర్తించారు. దీంతో విమానంలోని పైలట్లు ఏటీసీకి సమాచారం అందించారు. అనంతరం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఉదయం 9.17 గంటలకు లక్నో విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఈ సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల్ని తనిఖీ చేశారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్తితి అదుపులోనే ఉందని అక్కడి అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bagdogra
- Bomb Threat
- Delhi
- indigo
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

