Bomb threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb threat) ఆందోళన కలిగిస్తున్నాయి. పలు కార్యాలయాలకు, ముఖ్యమంత్రులకు, విమానాలకు, పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి (Udupi)లో గల ఓ ప్రైవేట్ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడిపి జిల్లాలోని విద్యోదయ పబ్లిక్ స్కూల్ (Vidyodaya Public School)కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న ఉడిపి పోలీసులు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాల ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్ ఐడీ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాంబు బెదిరింపులతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Air india | ఢిల్లీ టు పారిస్.. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య
Air India plane crash | విమాన ప్రమాదం.. ఘటనాస్థలి నుంచి 70 తులాల బంగారం, నగదు స్వాధీనం
Air India Plane crash | బాల్కనీల నుంచి దూకిన విద్యార్థులు.. వెలుగులోకి కొత్త వీడియో