Bomb threats | కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంకు బాంబు బెదిరింపులు
Bomb threats | కోల్‌కతా (Kolkata )లోని ఇండియన్ మ్యూజియం (Indian Museum)కు బాంబు బెదిరింపులు (Bomb threats) వచ్చాయి.
Bomb threats | కోల్‌కతా (Kolkata )లోని ఇండియన్ మ్యూజియం (Indian Museum)కు బాంబు బెదిరింపులు (Bomb threats) వచ్చాయి. మ్యూజియంలో బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు (threat mail) పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సందర్శకుల్ని మ్యూజియం నుంచి బయటకు పంపించేశారు. అనంతరం బాంబ్ స్వ్కాడ్ బృందాలు మ్యూజియంలో తనిఖీలు చేశారు.
అయితే, ఈ తనిఖీల్లో వారికి ఎలాంటి పేలుడు పదార్థాలూ దొరకలేదు. దీంతో బాంబు బెదిరింపు ఈమెయిల్ బూటకమని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే కాలంలో అమెరికా నుంచి ఇలాంటి మెయిల్స్ కొన్ని వస్తున్నట్లు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వాళ్లు తమకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు మెయిల్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
West Bengal | Kolkata Police received a mail from a group called ‘Terrorizer’s 111′ regarding a bomb threat at the Indian Museum. Bomb squad reached the location & visitors’ entry to the museum has been restricted for the next few hours: Kolkata Police
— ANI (@ANI) January 5, 2024
కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని పలువురు ప్రముఖులు, పారిశ్రామివేత్తలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో ముంబైలోని పలు బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అమ్మదాబాద్ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు కొందరు ఆగంతకులు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. ఇక నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram temple)తో సహా పేల్చేస్తామంటూ సీఎంను బెదిరించారు.
Also Read..
Swati Maliwal | రాజ్యసభకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్.. ప్రకటించిన ఆప్
Coronavirus | నిన్న ఒక్కరోజే 761 కొత్త కేసులు.. 12 మరణాలు
Ship Hijacked | 15 మంది భారతీయులు ఉన్న నౌక హైజాక్.. రంగంలోని ఇండియన్ నేవీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

