బిహార్లోని బర్హ్ ప్రాంతంలో గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. 17 మంది భక్తులతో పడవ ఉమానాథ్ ఘాట్ నుంచి దయారాకు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని బర్హ్ ఎస్డీఎం శుభం కుమార్ తెలిపారు.
ఈ ప్రమాదంలో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితులను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్ధలానికి చేరుకుంటోందని గాలింపు చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉంది.
Read More :