BJP | జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ (BJP) ఇవాళ ఉదయం తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. 44 మంది అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. అయితే, జాబితా విషయంలో కమలం పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ జాబితా ప్రకటనను విత్‌డ్రా చేసుకుంది. జాబితాలోని పేర్లను సవరించి మళ్లీ విడుదల చేస్తామని బీజేపీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
సుమారు పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) అసెంబ్లీకి ఎన్నికలు (assembly elections) జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ (BJP) సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ఇవాళ ఉదయం తొలి జాబితాను కూడా విడుదల చేసింది. అయితే, అనూహ్యంగా యూటర్న్ తీసుకుని.. ఆ జాబితాను విత్‌డ్రా చేసుకుంది.
మూడు విడతల్లో జరగబోయే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం ఉదయం విడుదల చేసింది. సెప్టెంబర్ 18న తొలి విడత ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులను, రెండో దశ (సెప్టెంబర్ 25) కోసం 10 మంది అభ్యర్థులను, మూడో దశ (అక్టోబర్ 1) కోసం 19 మంది అభ్యర్థులను కమలం పార్టీ ప్రకటించింది. అయితే, గంటల వ్యవధిలోనే ఆ జాబితాను ఉపసంహరించుకుంది. సవరణల అనంతరం త్వరలోనే కొత్త జాబితాను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
Also Read..
Ladakh | లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రకటించిన కేంద్రం
Delhi | ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి
Dhaka | బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు