Fuel Price Hike : కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్ను భారాలను మోపడం పట్ల కాషాయ కూటమి భగ్గుమంది. ప్రజల నుంచి పన్నుల పేరుతో భారీ వసూళ్లకు తెరలేపి జనం వెన్ను విరుస్తోందని మండిపడింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నిరసనలపై కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు.
ప్రజలు చెల్లించే పన్నులను కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని, పెట్రో భారాలు మోపుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మరోవైపు పెట్రో ధరల పెంపుపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను పెంచినా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటకలో పెట్రో ధరలు సమంజసంగానే ఉన్నాయని సమర్ధించుకున్నారు.
వ్యాట్ పెంచినా కర్నాటకలో డీజిల్ ధరలు ఇప్పటికీ గుజరాత్, మధ్యప్రదేశ్ కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రజలకు ఇంధన ధరలు అందుబాటులో ఉండేలా తాము చర్యలు చేపడతామని తెలిపారు. గతంలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వం కర్నాటక వనరులను ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోయేదని మండిపడ్డారు.
Read More :
Mahesh – Sitara | నాన్న కూచి.. ఫాదర్స్ డే స్పెషల్ మహేష్‌తో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన సితార