Mahesh – Sitara | సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య మహేష్‌తో కలిసి పలు షోలకు అటెండ్ అవుతూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అయితే మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యామిలీ అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నేడు ఫాదర్స్ డే సందర్భంగా మహేష్ బాబుతో దిగిన ఫోటోలను షేర్ చేసి స్పెషల్ పోస్ట్ పెట్టింది. మహేష్ ఒళ్ళో పడుకొని సరదాగా సితార అల్లరి చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ పోస్ట్‌కు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.. నువ్వు నా సూపర్ హీరో అంటూ క్యాప్షన్ ఇచ్చింది.