డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో.. ఈనెల 20వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. అయోధ్యలోని ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపోయింది. ఇక బద్రీనాథ్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీజేపీకి జలక్ తగిలిన విషయం తెలిసిందే. దీంతో కేదార్నాథ్ పుణ్యక్షేత్రంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా విశిష్టమైన ఆధ్మాత్మిక ప్రదేశం ఇది.
సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉన్న ఆ క్షేత్రాన్ని ఆయన తరుచూ సందర్శిస్తుంటారు. అయితే ఈ ఏడాది జూలైలో బీజేపీ ఎమ్మెల్యే శైలా రావత్ మృతిచెందిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయ్యింది. కేదార్నాథ్ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రాంతం నుంచి పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం బీజేపీ గాలిస్తున్నది.
డెహ్రాడూన్, ఢిల్లీ, లుథియానా, లక్నో నగరాల్లో సెటిల్ అయిన కేదార్నాథ్ వాసుల కోసం బీజేపీ ఎదురుచూస్తున్నది. ఓట్లు వేసేందుకు వాళ్లను స్వంత ప్రదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేదార్‌నాథ్‌కు చెందిన సుమారు నాలుగు వేల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినట్లు తెలుస్తోంది.