Shazia Ilmi : వివిధ రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 11 స్ధానాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ కేవలం 2 స్ధానాల్లోనే గెలుపొందింది. ఉప ఎన్నికల్లో ఓటమిని తమ పార్టీ అంగీకరిస్తుందని, ఓటమికి తాము ఈవీఎంలను కానీ, ఎన్నికల కమిషన్‌ను కానీ నిందించబోమని బీజేపీ నేత షజియ ఇల్మి పేర్కొన్నారు.
విపక్షాలు మాత్రం వివిధ ఎన్నికల్లో ఓటమిపాలైనా ఇప్పటివరకూ తమ ఓటమిని అంగీకరించలేదని, వారు నిత్యం ఈవీఎంలను నిందిస్తారని తాము హుందాగా ఓటమిని అంగీకరించడంతో విపక్షాల డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీయేనని సంవిధాన్ హత్యా దివస్ వెల్లడిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై బిహార్‌లోని పుర్నియా ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 11 స్దానాల్లో విజయం సాధించిందని, ఇది కేవలం విపక్ష కూటమికి దక్కిన విజయంగానే చూడరాదని అన్నారు. హరియాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇది సంకేతమని చెప్పారు. కాషాయ కూటమికి ఉప ఎన్నికల ఫలితాలు గట్టి షాక్‌ను ఇచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్వేష రాజకీయాలను ప్రభోదించదని, లోక్‌సభ ఎన్నికల అనంతరం విపక్షాలకు ఈ ఫలితాలు నైతిక స్ధైర్యం ఇచ్చాయని చెప్పుకొచ్చారు.
Read More :
Joe Biden | అమెరికాలో రాజకీయ హింసకు చోటులేదు: జో బైడెన్