Joe Biden | అమెరికాలో రాజకీయ హింసకు చోటులేదు: జో బైడెన్
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని చెప్పారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివారాలు తెలుసుకున్న ఆయన.. ఇది సరైనది కాదన్నారు.
న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని చెప్పారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివారాలు తెలుసుకున్న ఆయన.. ఇది సరైనది కాదన్నారు. ప్రతి ఒక్కరు దీనిని ఖండించాలని చెప్పారు. త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానని వెల్లడించారు. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడిందన్నారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ర్యాలీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు. ఇలాంటి ఘటనలను ఖండించడంలో యావత్ దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని బైడెన్ అన్నారు.
I have been briefed on the shooting at Donald Trump’s rally in Pennsylvania.
I’m grateful to hear that he’s safe and doing well. I’m praying for him and his family and for all those who were at the rally, as we await further information.
Jill and I are grateful to the Secret…
— President Biden (@POTUS) July 13, 2024
ట్రంప్‌పై కాల్పులను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) ఖండించారు. ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ జరుగలేదని తెలిసి ఊరట చెందానన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భవంతుణ్ని ప్రార్థిస్తున్నాని చెప్పారు. ఆయ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాని వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన బాధులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన సీక్రెట్ సర్వీస్, స్థానిక అధికారులను అభినందించారు. ఇలాంటి హింసకు అమెరికాలో చోటులేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను మనమంతా ఖండించాలన్నారు. ఇది మరింత హింసకు దారితీయకుండా మన వంతు కృషిచేయాలని చెప్పారు.
I have been briefed on the shooting at former President Trump’s event in Pennsylvania.
Doug and I are relieved that he is not seriously injured. We are praying for him, his family, and all those who have been injured and impacted by this senseless shooting.
We are grateful to…
— Vice President Kamala Harris (@VP) July 14, 2024
ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. కాల్పుల ఘటనలో ట్రంప్ తీవ్రంగా గాయపడనందుకు మనమంతా ఉపశమనం పొందాలన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని చెప్పారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆకాంక్షించారు. కాల్పుల తర్వాత ఓ చేత్తో రక్తమోడుతున్న తన చెవికి అడ్డుపెట్టుకోగా మరో చేత్తో పిడికిలి బిగించిన ట్రంప్ ఫొటోని ఆయన షేర్ చేశారు.
There is absolutely no place for political violence in our democracy. Although we don’t yet know exactly what happened, we should all be relieved that former President Trump wasn’t seriously hurt, and use this moment to recommit ourselves to civility and respect in our politics.…
— Barack Obama (@BarackObama) July 13, 2024
I fully endorse President Trump and hope for his rapid recovery pic.twitter.com/ZdxkF63EqF
— Elon Musk (@elonmusk) July 13, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

