Mamata Banerjee : మమతా బెనర్జీ సారధ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. బెంగాల్ పోలీసులు కుమ్మక్కు కావడంలో ఆరితేరారని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య సంస్మరణ సందేశం అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఆర్జీ కర్ ఆస్పత్రి సోదరి పేరు అందులో లేకపోవడం తమను షాక్‌కు గురిచేసిందని అన్నారు.
ఈ విషయంపై విపక్ష నేత స్పీకర్ వద్ద నిరసన తెలపగా అప్పుడు ఆర్జీ కర్ కూతురు అని ప్రస్తావించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఆర్జీ కర్ ఘటన బాధితురాలికి సంతాపం తెలపడం కేవలం పది సెకండ్ల సమయం చాలని, కానీ దీదీ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు నిమిషం పాటు మౌనం పాటించి ఆ దృశ్యాలను రికార్డు చేశారని, కానీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తమపై చర్యలు చేపడతామని పాలకులు హెచ్చరించారని చెప్పారు. అయితే ఈ పోరాటం సస్పెన్షన్ కన్నా ఉన్నతమైనది కావడంతో తాము వీడియోను పోస్ట్ చేశామని చెప్పారు. తమ పోరాటం అభయాల కోసమని స్పష్టం చేశారు. నిరసనకారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రతాపం చూపుతూ లాఠీచార్జి, భాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నారని అగ్నిమిత్రపౌల్ దీదీ సర్కార్‌పై భగ్గుమన్నారు.
Read More :
Harish Rao | మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు బీజేపీ నేతల బెదిరింపులు.. ఖండించిన హరీశ్‌రావు