Water Tanker Mafia : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సంక్షోభం తలెత్తడంపై బీజేపీ స్పందించింది. వాటర్ ట్యాంకర్ మాఫియాను నియంత్రించాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసినా పాలక ఆప్ నిస్తేజంగా వ్యవహరిస్తోందని బీజేపీ షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
సుప్రీంకోర్టు వాటర్ మాఫియాపై చర్యలు చేపట్టాలని విస్పష్టంగా ఆదేశించినా వారిపై చర్యలు తీసుకునేందుకు బదులు వాటర్ ట్యాంకర్ మాఫియాను కాపాడుతోందని దుయ్యబట్టారు. ప్రతి వాటర్ ట్యాంకర్‌పై ఆప్ కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. అందుకే వారు ట్యాంకర్ మాఫియా చర్యలు చేపట్టకుండా ఇతరులపై నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీలో నీటి సంక్షోభానికి హరియాణ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను నిందిస్తున్నారని అన్నారు. ఆప్ తీరును విపక్ష ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్ ప్రశ్నించాలని అన్నారు. జైలు నుంచి మీరు సర్కార్‌ను నడుపుతుంటే ఢిల్లీ ప్రజలు చుక్క నీరు లేక వీధుల్లోకి రావాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
T20 World Cup: రూథర్‌ఫోర్డ్ హాఫ్ సెంచరీ.. కివీస్‌పై విండీస్ విక్టరీ