బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 18:23:19

బీజేపీ ప్రభావం క్షీణిస్తోంది : చిదంబరం

 బీజేపీ ప్రభావం క్షీణిస్తోంది : చిదంబరం

న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత నుంచి ఎన్నికల్లో బీజేపీ ప్రభావం క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్‌ ఎన్నికల ఫలితాలను ఆయన ఊటంకించారు. బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారిన్ని నిలబెట్టుకున్నా.. బీజేపీ సాధించిన స్థానాలు స్వల్పమేనని గుర్తుచేశారు.

243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో బీజేపీ గెలిచింది కేవలం 74 సీట్లేనని, జేడీ(యూ) -43, హిందూస్థాన్‌ ఆవాస్‌ మోర్చా, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ 8 సీట్లు గెలిచి కారణంగానే ఎన్డీఏ కూటమి అధికారిన్ని నిలబెట్టుకో గలిగిందని పేర్కొన్నారు. మహాగట్‌ బంధన్‌ కూటమిలో ఆర్జేడీ-75 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా 70 సీట్లలో పోటీచేసిన కాంగ్రెస్‌ 19 స్థానాలకే పరిమితమవడంతో ఎంజీబీ కూటమికి అధికారం దూరమైందన్నారు. ఎన్డీఏ కూటమికి, ఎంజీబీ కూటమికి మధ్య ఓట్లశాత వ్యత్యాసం 0.03 మాత్రమేనని స్పష్టం చేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.