శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 14, 2021 , 19:23:13

‘మున్సిపల్‌ కార్పొరేషన్లను బీజేపీ దివాళా తీసింది’

‘మున్సిపల్‌ కార్పొరేషన్లను బీజేపీ దివాళా తీసింది’

న్యూఢిల్లీ: మున్సిపల్‌ కార్పొరేషన్లను బీజేపీ దివాళా తీసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా విమర్శించారు. 14 ఏండ్ల అవినీతి పాలనలో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)ను బీజేపీ అన్ని విధాలుగా దోచుకున్నదని ఆరోపించారు. నార్త్, ఈస్ట్ మునిసిపల్ కార్పొరేషన్లు ఎక్కువగా దివాళా తీశాయని తెలిపారు. వాటి బ్యాంకు ఖాతాల్లో వరుసగా రూ.12 కోట్లు, రూ.99 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుణం 6,276 కోట్లు మేర ఉన్నదని అన్నారు. ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే స్థితిలో కూడా మునిసిపల్ కార్పొరేషన్లు లేవన్నారు. ఎంసీడీలో అవినీతి తారాస్థాయికి చేరుకున్న విషయాన్ని బీజేపీ నేతలు కూడా అంగీకరించారని మనీష్ సిసోడియా ఎద్దేవా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo