BRS Party |హైదరాబాద్: మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో చేరినవారిలో మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం గోపీనాథ్ ముండే సెక్యూరిటీ, ప్రస్తుత జడ్పీటీసీ ఓంకార్ అబ్బా జాదవ్, జల్గావ్ జడ్పీటీసీ విజయ్ తవర్, మారెట్ కమిటీ చైర్మన్ సభాపతి విఠల్ నాగ్రాలే, మాజీ సభాపతి నారాయణ్ అబా పవార్, ధూలే నుంచి వినోద్ పాటిల్, సంచాలక్ మారెట్ కమిటీ సభ్యులు జగన్నాథ్ బావసర్, జనతా పార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ జాదవ్, భోర్సేన అధ్యక్షుడు బబ్లూ జాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి వికాస్ బంజారా, బీజేపీ తహసిల్ సెక్రటరీ విలాస్ రాథోడ్, ముస్లిం కౌన్సిల్ నుంచి తయ్యబ్ షేక్, మాజీ కమిషనర్ సోనవ్నే తదితరులు ఉన్నారు.