భువనేశ్వర్: తమ పార్టీకి చెందిన నేతతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణపై ఒడిశాలో కొందరు బీజేపీ నేతలు పట్టపగలు సీనియర్ మున్సిపల్ అధికారిని కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి దాడి చేశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ ఘటన జరిగింది.
భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న రత్నాకర్ సాహూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తుండగా, హఠాత్తుగా ఆయన చాంబర్లోకి ప్రవేశించిన కొందరు బీజేపీ కార్యకర్తల గుంపు ‘మా నేతతో అనుచితంగా ప్రవర్తిస్తావా?’ అని నిలదీసి ఆయన కాలర్ పట్టుకుని కొడుతూ, తన్నుతూ గదిలోంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.