బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఆయన గతంలో రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
హవేరీ నుంచి పోటీ చేయడానికి తన కుమారుడు కేఈ కంఠేష్కు బీజేపీ టికెట్ దక్కకపోవడానికి కారణం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ఆయన తండ్రి బీఎస్ యెడియూరప్ప అని ఈశ్వరప్ప ఆరోపిస్తున్నారు. శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి బీవై రాఘవేంద్రను బీజేపీ నిలిపింది. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈశ్వరప్ప పోటీ చేస్తున్నారు. దీంతో ఈశ్వరప్పపై బీజేపీ వేటు వేసింది.