కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో 15 ఏండ్ల్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరపడింది. ఓటమితో తృణమూల్ పార్టీలో పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన కీలక సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
ఈ సమావేశంలో మమత కొందరు పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారని భోగట్టా. దీనికితోడు కీలక సమావేశానికి 10 మంది నూతన ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం పార్టీలోని అంతర్గత పోరును బహిర్గతం చేసింది. నూతనంగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేల్లో 70 మంది హాజరయ్యారు.