ఆధారాల నాశనానికే..
ఉత్తరాఖండ్‌లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. ఈ కేసులో మాత్రం హడావుడిగా ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ అక్రమ నిర్మాణమని కూల్చివేయటంపై
- రిసార్ట్ కూల్చివేతపై అంకిత కుటుంబసభ్యుల ఆరోపణ
- ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వంపై అనుమానాలు
డెహ్రాడూన్/రిషికేశ్, సెప్టెంబర్ 25: ఉత్తరాఖండ్‌లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. ఈ కేసులో మాత్రం హడావుడిగా ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ అక్రమ నిర్మాణమని కూల్చివేయటంపై పెద్ద చర్చ నడుస్తున్నది. రిసార్ట్‌లో హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేసేందుకే సర్కార్ రిసార్ట్‌ను ఆఘమేఘాలపై కూల్చివేసిందని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. అంకిత సోదరుడు అజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘రిసార్ట్‌లో ఆధారాలను నాశనం చేసేందుకే రాత్రికిరాత్రే బుల్డోజర్లతో కూల్చివేశారు’ అని అన్నారు.
తీవ్రంగా కొట్టినట్టు ఆధారాలు
అంకిత శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని, నీట మునిగి చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబసభ్యులు తుది పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. అధికారులు సర్ది చెప్పి అంత్యక్రియలకు ఒప్పించారు. కాగా, అంకిత భండారి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ ఏరియాలో రిషికేశ్-బద్రినాథ్ జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

