9న బెంగాల్ సీఎం ప్రమాణం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్రంలో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
- ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్రంలో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మే 9న కోల్‌కతాలోని బ్రిడ్జి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సమిక్ భట్టాచార్య బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
‘బీజేపీ నూతన ప్రభుత్వం మే 9న ఉదయం 10 గంటలకు బ్రిడ్జి పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం చేస్తుందని భట్టాచార్య విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రవీంద్ర జయంతి రోజున నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బెంగాలీ క్యాలెండర్లో వైశాఖమాసంలోని 25వ రోజున జరగనుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నందున అదే రోజున ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

