MP Geeta Koda : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని సింగ్భుం ఎంపీ, మాజీ జార్ఖండ్ సీఎం మధు కోడా భార్య గీతా కోడా కాంగ్రెస్‌ను వీడి సోమవారం కాషాయ పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తుల పట్ల అసంతృప్తితో ఉన్న గీతా కోడా బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆమె ఇప్పటికే తన రాజీనామా లేఖను పార్టీ అధినాయకత్వానికి పంపారని సమాచారం.
ఇక ఇండియా విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబూలాల్ మరాండీ అంతకుముందు విరుచుకుపడ్డారు. అవినీతి పార్టీలు జట్టు కట్టాయని, భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలతో అసలు ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు బెంగాల్, ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తులకు నిరాకరించారని మరాండీ గుర్తు చేస్తూ అసలు విపక్ష ఇండియా కూటమికి మనుగడ లేదని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీని చూసి భయపడే అవినీతిపరులంతా ఇండియా కూటమిగా జట్టుకట్టారని మరాండీ ఆరోపించారు. అయితే గతంలో వారి ప్రవర్తన ఏంటనేది ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని 14 ఎంపీ స్ధానాలను బీజేపీ గెలుచుకుంటుందని బాబూలాల్ మరాండీ ధీమా వ్యక్తం చేశారు. కర్మ ఫలితంగానే మనీల్యాండరింగ్ కేసులో జేఎంఎం చీఫ్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టయ్యారని వ్యాఖ్యానించారు.
Read More :
Drugs | గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!