భోపాల్, జూన్ 4: మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల 40 ఏండ్ల చరిత్రను బీజేపీ తిరగరాసింది. మొత్తం 29 లోక్‌సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పాఘన్ సింగ్ కులస్తే, వీరేంద్ర కుమార్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విష్ణుదత్ శర్మ..తదితరులు మంచి మెజార్టీతో గెలుపొందారు.
అలాగే కాంగ్రెస్ కంచుకోట చింద్వారాలోనూ కాషాయం తన జెండాను ఎగురవేసింది. 1952లో ఈ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ, మళ్లీ ఇక్కడ విజయాన్ని అందుకుంది. రాయ్‌గఢ్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ 1.45 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సింధియా, గుణా స్థానం నుంచి 5,40,929 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.