Priyanka Gandhi : ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్ధానం నుంచి వైదొలగనుండటంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని బరిలో దింపేందుకు పార్టీ అగ్రనాయకత్వం సిద్ధమైంది. ప్రియాంక గాంధీని వయనాడ్ నుంచి పోటీ చేయించడంపై బీజేపీ భగ్గుమంది.
కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, మరో స్ధానం నుంచి పోటీ చేస్తున్న విషయం దాచి ఒకరి తర్వాత మరొక కుటుంబసభ్యులను వయనాడ్ ప్రజలపై రుద్దుతుండటం సిగ్గుచేటని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ప్రజలకు ఇలా ద్రోహం చేయడం వల్లే రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మూడోసారి ఓటమిని మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. అయితే చంద్రశేఖర్ విమర్శలను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తోసిపుచ్చారు. ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు. 2014లో వారణాసి నుంచి కూడా పోటీ చేస్తాననే విషయం వదోదర ఓటర్లకు తెలియకుండా ప్రధాని నరేంద్ర మోదీ మభ్యపెట్టారా అని ఆయన ప్రశ్నించారు.
Read More :
Yadagirigutta | యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు