గోవా ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించింది. ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉండగా.. బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో ఇక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు.
తమకు వచ్చిన సీట్లే కాకుండా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ పార్టీకి మద్దతుగా నిలుస్తారని చెప్పారు. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 సీట్ల బలం ఉండాలి. కాగా, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రెండు సీట్లలో విజయం సాధించింది.
దీన్ని శుభపరిణామంగా పేర్కొన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. గోవాలో నిజాయితీ ఉన్న రాజకీయాలకు ఇది ప్రారంభమని తెలిపారు. గోవాలో కాంగ్రెస్కు 11 సీట్లు లభించగా.. ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు.