కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు బీజేపీ షాక్ ఇవ్వనున్నది. ఎగ్జిట్ పోల్స్‌లో (Exit Polls) బీజేపీ ముందంజలో ఉంది. అక్కడ అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కంటే ఈసారి బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
కాగా, పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీకి 21-26 సీట్లు, టీఎంసీకి 16-18 సీట్లు, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని జన్ కీ బాత్ సర్వే పేర్కొంది. ఇండియా న్యూస్-డి-డైనమిక్స్ అంచనా ప్రకారం బీజేపీకి 21, టీఎంసీకి 19 సీట్లు, కాంగ్రెస్‌కు 2 సీట్లు రానున్నాయి. రిపబ్లిక్ భారత్-మాట్రిజ్ సర్వే ప్రకారం బీజేపీకి 21-25, టీఎంసీకి 16-20 సీట్లు, కాంగ్రెస్‌కు 0-1 గా అంచనా వేశారు.