MCD polls : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Muncipal corporation of Delhi – MCD) లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేపీకి 7 స్థానాలు దక్కగా, ప్రతిపక్ష ఆప్ (AAP) 3 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఇక మిగిలిన 12వ స్థానాన్ని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) తన ఖాతాలో వేసుకుంది.
అయితే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచినా గతంలో తాను గెలిచిన రెండు స్థానాలను కోల్పోయింది. మొత్తం 9 సిట్టింగ్ స్థానాలకుగాను బీజేపీ 7 గెలుచుకుంది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు, కాంగ్రెస్‌కు ఒక్కో స్థానాన్ని కోల్పోయింది. అదేవిధంగా బీజేపీ గెలిచిన ఏడు స్థానాల్లో ఒకటి ఆప్ సిట్టింగ్ స్థానం కాగా, ఆప్ గెలిచిన మూడు స్థానాల్లో ఒకటి బీజేపీ సిట్టింగ్ స్థానం ఉంది.
తాజా ఫలితాల అనంతరం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 250 స్థానాలకుగాను బీజేపీకి 122 స్థానాలున్నాయి. ఆప్‌కు 102 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఇక కాంగ్రెస్ సీట్ల సంఖ్య 9 కి పెరిగింది.