Manipur | మహిళల నగ్న ఊరేగింపు ఘటన నిందితులపై కఠిన చర్యలు చేపడతాం : బీరేన్ సింగ్
మణిపూర్లో (Manipur) హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇంఫాల్ : మణిపూర్లో (Manipur) హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో ఆధారంగా సుప్రీంకోర్టు సమోటోగా ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుంది. ఇక మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. మణిపూర్ హింసాకాండపై, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదిపారు. ఇది నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని మోదీ పేర్కొన్నారు. మణిపూర్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరారు. దేశం యావత్తూ ఈ ఘటనపై ఆగ్రహంతో ఉందని, నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
మణిపూర్లో కుకి-జోమి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా తీసుకువెళుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బుధవారం వెలుగుచూసింది. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మే 4న జరిగిందని, బాధితురాలిలో ఒకరు 19 ఏండ్ల యువతి అని పోలీస్ వర్గాలు తెలిపాయి.
Read More :
Parliament Monsoon Session | లోక్ సభ మధ్యాహ్నానికి వాయిదా
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Biren Singh
- Manipur
- parade
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

