Viral Video | ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ (Bijnor)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral Video) అవుతోంది.
బిజ్నోర్లోని ఢిల్లీ – పౌరి నేషనల్ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. అటుగా వెళ్తున్న వారు వెంటనే స్పందించి సదరు యువకుల్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, రీల్స్ చేస్తూ వారు ప్రమాదానికి గురైనట్లుగా నెటిజన్లు చెప్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం యువకుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Again under the influence of reel…two lives in danger!#Delhi #Pauri National Highway bike riders shooting video with drone hit a car…condition is serious!!#viralvideo #Bijnor #Reels #UttarPradesh pic.twitter.com/fv9pzV8nw6
— Siraj Noorani (@sirajnoorani) August 14, 2024
Also Read..
Tamil Nadu | ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. నిప్పుల గుండంపై పడి ఏడేళ్ల బాలుడికి గాయాలు
Air India | లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. ముంబైకి దారి మళ్లింపు