పాట్నా: వర్షాకాలంలో ఈ వేడేంటి? అసలు వానలు ఎందుకు పడటం లేదు? అంటూ బీహార్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త రాజ్‌కుమార్ జా ఏకంగా దేవుడినే ప్రతివాదిగా చేసి కేంద్ర భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు చేశారు.
దర్బంగ జిల్లా మహార్కు చెందిన రాజ్‌కుమార్ జా వర్షాలు పడకపోవడానికి గల కారణాలు తెలపాలంటూ దరఖాస్తు చేశారు. ‘వర్షాలు పడకపోవడానికి కారణాలు దేవుడిని అడిగి తెలుసుకోండి. చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్రయాన్-3 వల్ల వాతావరణం చెడిందా? ’ అని ప్రశ్నించారు.