మద్యపానం వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. కొందరైతే మద్యానికి బానిసలు అవుతారు. దాని వల్ల వారితో పాటు.. కుటుంబం కూడా నాశనం అవుతుంది. రోడ్డున పడాల్సి వస్తుంది. అందుకే.. మద్యపానం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అన్నింటికీ హానికరం అని చెబుతుంటారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే మద్యం నిషేధం. కొన్ని ప్రభుత్వాలు మద్యాన్ని తమ రాష్ట్రాల్లో నిషేధించాయి. అందులో ఒకటి బీహార్.
అక్కడ లిక్వర్ ప్రొహిబిషన్ లాను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్రమంగా మద్యాన్ని తెచ్చి బీహార్‌లో అమ్ముతున్నారు. దొంగచాటుగా మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
అయితే, బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జీవితంలో మద్యం ముట్టుకోను అని ప్రతిజ్ఞ చేశారు. ఆయన ముట్టుకోను అని ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాదు.. బీహార్ పోలీసులు అందరితో ప్రతిజ్ఞ చేయించాడు.
పాట్నాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులతో కలిసి డీజీపీ.. ఈ ప్రతిజ్ఞ చేశారు. నేను, సందీప్ కుమార్ సింఘాల్, ఈరోజు అంటే నవంబర్ 26, 2021 నుంచి నా జీవితంలో ఎప్పుడూ మద్యం ముట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను డ్యూటీలో ఉన్నా సరే.. లేకున్నా సరే.. నా జీవితంలో ఏనాడూ మద్యం తాగను. అలాగే రాష్ట్రంలో లిక్వర్ ప్రొహిబిషన్ చట్టం సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాను.. అంటూ తను ప్రతిజ్ఞ చేస్తూ.. పోలీసులతో డీజీపీ ప్రతిజ్ఞ చేయించారు.
డీజీపీ చేయించిన ఈ ప్రతిజ్ఞ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే… బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అధికారులతో కలిసి ఇదే ప్రతిజ్ఞను చేయించారు. ఆ తర్వాత డీజీపీ కూడా పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు.
#WATCH | Patna: Bihar DGP SK Singhal administers an oath to all Police personnel at the Police HQ to ensure implementation of liquor ban in the state, and personally abide by the ban too. pic.twitter.com/DTXloFSJXb
— ANI (@ANI) November 26, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బీజింగ్ జనతా పార్టీగా మారిన కాషాయ పార్టీ : మల్లికార్జున్ ఖర్గే
Ships collision: గల్ఫ్ ఆఫ్ కచ్‌లో ఢీకొన్న రెండు ఓడలు..!
దళితుడి పెళ్లి ఊరేగింపు.. రాళ్లు రువ్విన 10 మంది అరెస్టు