Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) నేడు ఢిల్లీ (Delhi) పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ (special packages for Bihar) ఇవ్వాలని ప్రధాని మోదీని నితీశ్ డిమాండ్ చేసే అవకాశం ఉందని జేడీయూ వర్గాలు తెలిపాయి.
Bihar CM Nitish Kumar will meet Prime Minister Narendra Modi, Union HM Amit Shah and BJP national president JP Nadda. CM Nitish Kumar is likely to demand for special packages for Bihar when he meets PM Modi. He is likely to meet veteran BJP leader LK Advani as well: JD(U) Sources
— ANI (@ANI) February 7, 2024
మరోవైపు బీహార్‌లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కూడా బీజేపీ అగ్రనేతలతో సీఎం నితీశ్ చర్చించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటనలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అడ్వానీని కూడా నితీశ్ కలిసే అవకాశం ఉందని తెలిపాయి. అడ్వానీకి కేంద్రం ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Red Sea | ఎర్రసముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై హౌతీ రెబల్స్ దాడి
Visa Free Entry | భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన ఇరాన్.. షరతులు వర్తిస్తాయి..!
Chennai | మూవింగ్ బస్సులో పెద్ద రంధ్రం.. తృటిలో తప్పించుకున్న మహిళ.. VIDEO