Red Sea | ఎర్రసముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై హౌతీ రెబల్స్ దాడి
Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో హౌతీ రెబల్స్ (Houthi rebels) నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా దాడులు మాత్రం ఆపడం లేదు.
Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో హౌతీ రెబల్స్ (Houthi rebels) నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా దాడులు మాత్రం ఆపడం లేదు. రెడ్ సీ మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరో రెండు నౌకలపై మంగళవారం డ్రోన్లతో దాడి (Drone Attacks) చేశారు. అందులో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది.
ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలో తొలి దాడి జరిగింది. యెమెన్ (Yemen) తీర ప్రాంత పట్టణమైన హొడైడా వద్ద బార్బడోస్ జెండాతో వస్తున్న బ్రిటన్ కంపెనీకి చెందిన నౌకపై డ్రోన్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నౌక అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, సిబ్బందికి ఎవరికీ గాయాలు కాలేదని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది.
ఆ తర్వాత రెండో దాడి యెమెన్ దక్షిణ తీర ప్రాంత పట్టణం ఎడెన్ వద్ద జరిగింది. మార్షల్ జెండాతో అమెరికా నుంచి భారత్కు వస్తున్న గ్రీన్ కంపెనీకి చెందిన నౌకపై దాడి చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ప్రైవేటు భద్రతా సంస్థ యాంబ్రే ( Ambrey) వెల్లడించింది. నౌకకూ నష్టం జరగలేదని తెలిపింది.
Also Read..
Visa Free Entry | భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన ఇరాన్.. షరతులు వర్తిస్తాయి..!
Helmet gift | కుమార్తె పెళ్లిలో అతిథులకు రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు.. ఎందుకో తెలుసా..?
ED Raids: ఫారెస్ట్ పనుల్లో అక్రమాలు.. మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

