Visa Free Entry | భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చే దేశాల జాబితాలో తాజాగా ఇరాన్ (Iran) వచ్చి చేరింది. భారతీయ పర్యాటకులకు (Indian Tourists) వీసా ఫ్రీ ఎంట్రీ (Visa Free Entry)ని మంగళవారం ప్రకటించింది. వీసా అవసరం లేకుండానే భారతీయులు తమ దేశానికి రావొచ్చని వెల్లడించింది. ఈ మేరకు వీసా కలిగి ఉండాలన్న నిబంధనలను ఈ నెల 4 నుంచి ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు తెలిపింది.
అయితే కొన్ని షరతులు పెట్టింది. భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజుల పాటు ఉండొచ్చని తెలిపింది. విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా ఫ్రీ ఎంట్రీ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది. కేవలం పర్యాటకం కోసం వచ్చినవారికి మాత్రమే వీసా ఎత్తివేత అమలవుతుందని తెలిపింది. ఆరు నెలలకోసారి మాత్రమే ఈ వీసా రహిత టూర్లకు అనుమతిస్తామని పేర్కొంది.
Also Read..
ED Raids: ఫారెస్ట్ పనుల్లో అక్రమాలు.. మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు
Hyderabadi Student: అమెరికాలో హైదరాబాదీపై అటాక్.. హెల్ప్ చేయాలని వేడుకున్న విద్యార్థి.. వీడియో