Helmet gift | కుమార్తె పెళ్లిలో అతిథులకు రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు.. ఎందుకో తెలుసా..?
Helmet gift | ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలోని ముదాపర్ ఏరియాకు చెందిన సేద్ యాదవ్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లిని.. రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకు చిక్కిన చక్కని అవకాశంగా వినియోగించుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు ఆయన హెల్మెట్లు, స్వీట్లను రిటర్న్ గిఫ్టులుగా ఇచ్చారు.
Helmet gift: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలోని ముదాపర్ ఏరియాకు చెందిన సేద్ యాదవ్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లిని.. రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకు చిక్కిన చక్కని అవకాశంగా వినియోగించుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు ఆయన హెల్మెట్లు, స్వీట్లను రిటర్న్ గిఫ్టులుగా ఇచ్చారు. రోడ్ సేఫ్టీపై జనంలో అవగాహన కల్పించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సేద్ యాదవ్ చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. సేద్ యాదవ్ కుమార్తె నీలిమ స్పోర్ట్స్ టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు సరాన్గఢ్-బిలాయ్గఢ్ జిల్లా లంకహుడా గ్రామానికి చెందని కమ్హాన్ యాదవ్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే తన కుమార్తె పెళ్లి సందర్భంగా సమాజానికి పనికొచ్చే ఏదైనా మంచి సందేశం ఇవ్వాలని సేదవ్ యాదవ్ నిర్ణయించుకున్నారు.
ఆ మేరకు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులందరికీ సోమవారం ఆయన హెల్మెట్లు గిఫ్టులుగా ఇచ్చాడు. అంతేగాక వివాహ వేడుకల్లో భాగంగా సేదవ్ యాదవ్ కుటుంబసభ్యులంతా తలలకు హెల్మెట్లు ధరించి నృత్యాలు చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికే ఇలా చేశామని యాదవ్ చెప్పారు. జీవితం చాలా విలువైనదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఈ సందర్భంగా ఆయన అతిథులకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

