Chennai | తమిళనాడు చెన్నై (Chennai)లో ఓ మహిళా ప్రయాణికురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. బస్సు ఫ్లోర్‌పై పెద్ద రంధ్రం పడింది. అక్కడే కూర్చున్న మహిళ ఆ రంధ్రం గుండా కింద పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
చెన్నైలోని వల్లలార్ నగర్ (Vallalar Nagar) నుంచి తిరువెర్కాడు (Thiruverkadu) మధ్య నడుస్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (Metropolitan Transport Corporation) బస్సులో మంగళవారం ఓ మహిళ ప్రయాణించింది. బస్సు చివర్లోని 59వ సీట్లో కూర్చుంది. అయితే, బస్సు అమింజికరై (Aminjikarai) సమీపంలోకి రాగానే సదరు మహిళ తను కూర్చున్న సీటు నుంచి పైకి లేచింది. ఆ సమయంలో బస్సు ఫ్లోర్ అకస్మాత్తుగా కూలి పెద్ద రంధ్రం పడింది (Hole In Moving Bus). దీంతో ఆ మహిళ కూడా రంధ్రం గుండా పడిపోయింది.
అప్రమత్తమైన తోటి ప్రయాణికులు డ్రైవర్‌కు సమాచారం అందించడంతో బస్సును ఆపేశారు. అదృష్టవశాత్తూ ఆ మహిళ చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
சென்னை திருவேற்காட்டில் இருந்து, வள்ளலார் நகர் செல்லும் தடம் எண் 59 பேருந்தில், இருக்கையில் அமர்ந்திருந்த சகோதரி ஒருவர், இருக்கையின் கீழ் இருந்த பலகை உடைந்து, ஓடிக்கொண்டிருந்த பேருந்தில் இருந்து கீழே விழுந்து, அதிர்ஷ்டவசமாக உயிர் தப்பியுள்ளார். தமிழகத்தில் திமுக அரசு நிர்வாகம்… pic.twitter.com/pRgmqyZzEY
— K.Annamalai (@annamalai_k) February 6, 2024
Also Read..
Red Sea | ఎర్రసముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై హౌతీ రెబల్స్ దాడి
Visa Free Entry | భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన ఇరాన్.. షరతులు వర్తిస్తాయి..!
MS Dhoni | ఐపీఎల్ సమీపిస్తున్న వేళ.. దేవరీ మా ఆలయంలో ధోనీ ప్రత్యేక పూజలు.. VIDEO