పాట్నా: కేంద్రంలోని బీజేపీ ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్ పునరుద్ఘాటించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత ప్రయత్నాలు వేగం పుంజుకోవడంతో ఆ పార్టీ భయపడుతున్నదని, ఈ నేపథ్యంలో ముందస్తుగా సార్వత్రిక ఎన్నికలు వచ్చేందుకు బలమైన అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
నితీశ్‌కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏకమవుతుండటాన్ని కేంద్రంలోని బీజేపీ గమనిస్తున్నదని అన్నారు. ఈనెల 23న జరిగే ప్రతిపక్షాల సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరవుతారని చెప్పారు. బీహార్ అధికార కూటమి నుంచి మాజీ సీఎం మాంజీని తొలగించడాన్ని నితీశ్ సమర్థించుకొన్నారు.