న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాలకు శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. టారిఫ్‌ల కారణంగా అమెరికాతో దూరం పెరుగుతూ చైనాతో భారత్ బంధం బలపడుతున్న వేళ రాజ్‌నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆత్మనిర్భర భారత్, స్వావలంబన గురించి రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి సహా దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు నీలగిరి తరగతి స్టెల్త్ ఫ్రిగేట్లను ప్రారంభించడంతోపాటు స్వదేశీకరణలో గణనీయమైన పురోగతి సాధించినట్టు వివరించారు. యుద్ధ నౌకలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయకూడదని నేవీ నిర్ణయించుకుందని చెప్పారు.